: 'దంగల్' సినిమా ద్వారా అమీర్ ఖాన్ ఎంత సంపాదించాడో తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే!
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తాజా చిత్రం 'దంగల్' బాక్సాఫీసును కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను డీస్నీ యూటీవీతో కలసి అమీర్ ఖాన్ నిర్మించాడు. ఈ సినిమా ద్వారా అమీర్ ఖాన్ సంపాదించిన ఆదాయం అక్షరాలా రూ. 175 కోట్లు. ఈ విషయాన్ని పింక్ విల్లా వెబ్ సైట్ వెల్లడించింది. ముందుగానే రూ. 35 కోట్ల రెమ్యునరేషన్ ను అమీర్ తీసుకున్నాడట. ఆ తర్వాత బిజినెస్ లో 33 శాతం వాటాను ఆయన రాయించుకున్నాడు. ఇవి రెండూ కలిపి ఆయనకు రూ. 175 కోట్లను తెచ్చిపెట్టాయి. అంతేకాదు, భవిష్యత్తులో ఈ సినిమా ఏ రకంగా ఆదాయాన్ని పొందినా... అందులో 33 శాతం అమీర్ కు రాయల్టీగా అందుతుంది.