: అత్యంత సంపన్న ఆసియన్ల జాబితాలో మళ్లీ ఆ ప్రవాస భారతీయులదే మొదటిస్థానం!
ఆసియన్ల వార్షిక ర్యాంకింగ్స్ లో అత్యంత సంపన్నుల లిస్టులో ఎన్ఆర్ఐలు హిందూజా బ్రదర్స్ మరోసారి తొలిస్థానంలో నిలిచారు. నిన్న రాత్రి బ్రిటన్ లో ఈ జాబితా విడుదలైంది. హిందూజ బదర్స్ మొత్తం సంపద 19 మిలియన్ పౌండ్స్ గా ఆ జాబితాలో పేర్కొన్నారు. ఇండియన్ కరెన్సీలో ఆ విలువ సుమారు రూ.1,54,253 కోట్లు. గతేడాది కంటే ఈ సంపద దాదాపు 2.5 బిలియన్ పౌండ్లకు పైనే పెరిగింది. ఆ తరువాతి స్థానంలో స్టీల్ టైకూన్ లక్ష్మి ఎన్ మిట్టల్ నిలిచారు. లక్ష్మి మిట్టల్ 12.6 బిలియన్ పౌండ్ల (రూ.1,02,294కోట్లు) సంపదతో ఈ స్థానంలో నిలిచారు. గతేడాది ఆయన సంపద విలువ 6.4 బిలియన్ పౌండ్లుగా ఉంది.
బ్రిటన్ లోని 101 సంపన్న ఆసియన్ల సంపద మొత్తం 69.9 బిలియన్ పౌండ్లు (రూ.5,67,492కోట్లకు పైనే)గా ఉందని ఆ జాబితాలో పేర్కొన్నారు. గతేడాది ఈ విలువ ఇప్పటికంటే 25 శాతం తక్కువగా ఉంది. ఈ జాబితాలో హిందూజా బ్రదర్స్, లక్ష్మి మిట్టల్ తర్వాత ఇండోరమ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్ లోహియా నిలిచారు.