: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి
కర్ణాటకలో అదుపుతప్పిన ఓ లారీ బీభత్సం సృష్టించింది. టైరు పగలడంతో ఒక్కసారిగా దూసుకొచ్చిన ఆ లారీ చిత్రదుర్గ జిల్లా ఎలేరాంపుర వద్ద 2 ఆటోలు, ఒక టెంపో ట్రావెలర్‌ను ఢీకొంది. దీంతో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద స్థలికి చేరుకున్న సహాయక బృందాలు గాయాలపాలయిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాయి. గాయాలపాలయిన వారు టెంపో ట్రావెలర్‌లో ప్రయాణిస్తోన్న వారని పోలీసులు తెలిపారు. ఆటోల్లో ప్రయాణిస్తూ మృతి చెందిన వారంతా విజయపుర జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.