: జయ స్థానంపై బీజేపీ కన్ను.. ఆర్కేనగర్ నుంచి బరిలోకి సినీ సంగీత దర్శకుడు!


జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. ఎలాగైనా గెలిచి తీరాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు గంగై అమరన్‌ (ఇళయరాజా సోదరుడు)ను బరిలో నిలిపింది. అన్నాడీఎంకే నుంచి శశికళ బంధువు దినకరన్ పోటీ చేస్తుండగా, మరోపక్క జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కూడా పోటీ చేస్తూ, రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. పన్నీర్ సెల్వం వర్గం నుంచి మధుసూదనన్ పోటీ చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News