: ఏపీకి ప్యాకేజీ ఇచ్చారు...మాకు రుణమాఫీ చేయండి: కేటీఆర్ డిమాండ్


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు కనుక తమకు కూడా సాయం చేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిందని అన్నారు. ఈ మేరకు వారికి రుణమాఫీ చేస్తున్నారని, అలాగే ఏపీ కోరినట్టు ప్యాకేజీ ఇస్తున్నారని అన్నారు. తమకు మాత్రం కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని చెప్పిన ఆయన, తమకు ఉత్తరప్రదేశ్ లాగే రుణమాఫీ చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రైతులు కూడా ఉత్తరప్రదేశ్ రైతుల్లాంటి వారేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకు రుణమాఫీ చేసేందుకు ఇక్కడి బీజేపీ నేతలు ప్రయత్నించాలని ఆయన సూచించారు. కేంద్రంలో ఉన్నది బీజేపీ కనుక బీజేపీ నేతలే వెళ్లి ప్రధానిని రుణమాఫీపై నిలదీయాలని ఆయన డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News