: బ‌ర్గర్‌ను రూ.6,55,505 కు సొంతం చేసుకున్న వ్య‌క్తి!


దుబాయ్ లో ఓ బర్గర్ భారీ ధ‌ర ప‌లికి వార్త‌ల్లోకెక్కింది. చారిటీ వేలంలో భాగంగా ఓ బ‌ర్గ‌ర్‌ను వేలానికి ఉంచారు. అయితే, దుబాయ్ లైఫ్ స్టైల్ మ్యాగజీన్ విల్లా వ్యవస్థాపకుడు అస్మా అల్ ఫహిమ్ దాన్ని 10వేల డాలర్లకు (రూ.6,55,505) ద‌క్కించుకున్నాడు. ఈ బర్గర్ లో యూనిటెడ్ అరబ్ ఎమిరెట్స్ లోని ఏడు ఎమిరెట్స్ కు ప్రాతినిధ్యం కల్పిస్తూ ఏడు గొడ్డు మాంసం ముక్కలు ఉంటాయి. ఈ ప్ర‌త్యేక బ‌ర్గ‌ర్‌ను దుబాయ్‌ గాలెరీస్ లఫెట్టేకి చెందిన కలినరీ డైరెక్టర్ రస్సెల్ ఇంపియాజి, ఖత్తర్ రాయల్ ఫ్యామిలీకి చెందిన సభ్యుడు షేక్ మొహమ్మద్ బిన్ అబ్దులాహ్ అల్ థానీ క‌లిసి తయారుచేశారు.
 
ఇటువంటి బ‌ర్గ‌ర్ వేలాన్ని వీరు రెండేళ్ల క్రితం కూడా నిర్వ‌హించారు. అయితే అప్పుడు ఆ బర్గర్ ను 7 వేల డాలర్లకు ఒక‌రు సొంతం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఇంత భారీ మొత్తం ధ‌ర ప‌లికింది. ఈ వేలం ద్వారా సేకరించిన డ‌బ్బును బెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించడానికి ఉప‌యోగిస్తారు.

  • Loading...

More Telugu News