: ఆసీస్ ఆలౌట్... ఐదు వికెట్లు తీసిన జడేజా


రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 451 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఆసీస్ జ‌ట్టులో కెప్టెన్ స్మిత్‌, మ్యాక్స్ వెల్ మిన‌హా బ్యాట్స్‌మెన్ ఎవ్వ‌రూ అంత‌గా రాణించ‌లేదు. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ల‌లో రెన్షా 44, వార్న‌ర్‌ 19, మార్ష్‌ 2, హెచ్‌.కాంబ్ 19, మ్యాక్స్‌వెల్ 104, వాడే 37, క‌మ్మిన్స్ 0, ఓకీఫ్ 25, లియాన్ 1, హెచ్‌.వుడ్ 0 ప‌రుగులు చేసి అవుట్ కాగా కెప్టెన్ స్మిత్ 178 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. భార‌త బౌల‌ర్ల‌లో జ‌డేజా 5, ఉమేశ్ యాద‌వ్ 3, అశ్విన్ 1 వికెట్లు తీశారు. ఇషాంత్, మురళీ విజయ్ లకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. 

  • Loading...

More Telugu News