: నిరాహార దీక్షకు దిగిన ‘సర్దార్’ డిస్ట్రిబ్యూటర్.. పవన్ జోక్యం చేసుకునే వరకు విరమించబోనని స్పష్టం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ కొంత కాలంగా తన నిరసనను తెలుపుతున్న విషయం తెలిసిందే. 'సర్దార్' సినిమాతో తమకు నష్టం వచ్చిందని ఆవేదన తెలుపుతున్న ఆయన... పవన్ కల్యాణ్ నటిస్తోన్న కొత్త చిత్రం కాటమరాయుడు సినిమా రైట్స్ ఇస్తామని నిర్మాత శరత్ మరార్ అప్పట్లో తనకు హామీ ఇచ్చారని, ఈ సినిమా హక్కులను తక్కువ ధరకు ఇచ్చి ఆదుకుంటానని అన్నారని తెలిపారు. అయితే ఈ సినిమాను తనకు ఇవ్వకుండా వేరే డిస్ట్రిబ్యూటర్‌కు అధిక ధరకు అమ్ముకుని ఆ నిర్మాత మాట తప్పారని ఆరోపిస్తూ ఈ రోజు హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్ వద్ద సంపత్ నిరాహార దీక్షకు దిగాడు. తన విషయంలో పవన్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరుతున్నారు. తనకు న్యాయం జరిగేవరకు దీక్ష విరమించబోనని చెప్పాడు.