: మోదీ దేవుడు కాదు.. ఆయనను ఆపాల్సిన అవసరం ఉంది: దిగ్విజయ్
ప్రధాని మోదీని ఆపాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఆయనేమీ దేవుడు కాదని చెప్పారు. ఆయనను ఎదుర్కోవడానికి విపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. మతతత్వ శక్తులను వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. మరోవైపు గోవా ఎమ్మెల్యే విశ్వజిత్ రాణె రాజీనామాపై కూడా డిగ్గీ రాజా స్పందించారు.
ఉదయం వరకు రాణె బాగానే ఉన్నారని... ఉదయం 10 గంటలకు పార్టీ విప్ పై సంతకం కూడా చేశారని... ఆ తర్వాత జరిగిన బలపరీక్షకు గైర్హాజరయ్యారని చెప్పారు. గోవా ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం కావడంతో... ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి విశ్వజిత్ రాణె రాజీనామా చేశారు.