: రాంచీ టెస్టు: 400 పరుగులు దాటిన ఆసీస్ స్కోరు
తమ జట్టులోని మిగతా బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమైనా ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్‌తో పాటు మ్యాక్స్‌వెల్ అద్భుత సెంచరీతో రాణించడంతో రాంచీ టెస్టులో ఆసీస్ జట్టు ఈ రోజు భోజన విరామ సమయానికి 7 వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో స్మిత్ 153, ఒకీఫ్ 1 పరుగుతో ఉన్నారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లలో రెన్షా 44, వార్నర్ 19, మార్ష్ 2, హెచ్.కాంబ్ 19, మ్యాక్స్‌వెల్ 104, వాడే 37, కమ్మిన్స్ 0 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 2, అశ్విన్ 1 వికెట్లు తీయగా జడేజా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు.
That's lunch on Day 2 of the 3rd @Paytm Test. Australia are 401/7 (Smith 153*, Maxwell 104). Follow the game here - https://t.co/d3NMQQCro5 pic.twitter.com/Z64rrNZVKQ
— BCCI (@BCCI) 17 March 2017