: రైతుల గురించి ఎంత చెప్పినా తక్కువే.. వారికి పాదాభివందనం..!: చంద్రబాబు


తనపై నమ్మకంతో 33 వేల ఎకరాల భూములిచ్చిన రైతుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడంపై అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడారు. కట్టుబట్టలతో రాష్ట్రానికి వచ్చిన మనం ఈరోజు ఇలాంటి భవనాల్లో చట్టాలు, పాలన చేసుకునేందుకు కారణం అమరావతి ప్రాంత రైతులేనన్నారు.  వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని, వారికి పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ఏపీకి ఎంతో కీలకమైన రాజధాని, పోలవరం రెండూ తన కల అన్న చంద్రబాబు రాష్ట్రంపై ప్రేమతో వాటికి నిధులిచ్చి సహకరిస్తున్న మోదీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇప్పటి వరకు  రూ.10,461 కోట్ల సాయం అందినట్టు చంద్రబాబు వెల్లడించారు.

  • Loading...

More Telugu News