: తల్లిదండ్రులకు షాక్... కొడుకుగా వెళ్లి వారం తరువాత కుమార్తెగా తిరిగి వచ్చాడు!


గుజరాత్‌ కి చెందిన ఓ నగల వ్యాపారికి అతని కుమారుడు కుమార్తెగా మారి షాక్ ఇచ్చాడు. ఘటన వివరాల్లోకి వెళ్తే...గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని మాధవపుర ప్రాంతంలో నగల దుకాణం గల వ్యాపారి తన కుమారుడు శ్యాం కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగల దుకాణం చూసుకునే తమ కుమారుడ్ని వెతికి పెట్టాలని కోరారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతని ఆచూకీని పట్టేసి కుటుంబ సభ్యులకు నిన్న ఫోన్ చేశారు. శ్యాంను తాము గుర్తించామని, అయితే శ్యామ్ ఇప్పుడు మగాడిగా లేడని, లింగమార్పిడితో స్త్రీగా మారాడని చెప్పారు. దీంతో ఆ తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు.

డిగ్రీలో ఉండగా తనలో మార్పులు వస్తున్నాయని తల్లిదండ్రులకు చెప్పాడు. చికిత్స చేయించుకుంటానని వారికి చెప్పినా, వారు అందుకు అంగీకరించలేదు. దీంతో సమయం కోసం చూసిన శ్యామ్ వారికి తెలియకుండా వెళ్లిపోయి, శస్త్ర చికిత్స ద్వారా అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిపోయాడు. పోలీసులు తనను గుర్తించిన తరువాత తన తల్లిదండ్రులతో మాట్లాడేందుకు కూడా శ్యామ్ ఆసక్తి చూపకపోవడం విశేషం. దీంతో పోలీసులు, వైద్యులు కలిసి శ్యామ్ కు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. 

  • Loading...

More Telugu News