: ఎస్సీ కమిషన్ కు వివరణ ఇచ్చుకున్న టీఆర్ఎస్ నేతలు
టీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, వినోద్ ఢిల్లీలో ఎస్సీ కమిషన్ ఎదుట హాజరయ్యారు. గత సంవత్సరం ఢిల్లీలో ఏపీ భవన్ ఎదుట ధర్నా సమయంలో అక్కడి ఉద్యోగి చందరరావుపై టీఆర్ ఎస్ నేతలు చేయి చేసుకున్నారు. దాంతో అతను ఎస్సీ కమిషన్ లో ఫిర్యాదు చేశాడు. ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు టీఆర్ ఎస్ నేతలు నాడు జరిగిన సంఘటనకు గల కారణాలను వివరించారు.