: 2014 మంది ఒకేసారి చీపుర్లతో ఊడ్చి పడేశారు... వరల్డ్ రికార్డు కొట్టేశారు!


ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. ఒకేసారి 2014 మంది చీపుర్లు ప‌ట్టుకున్నారు. స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్ అంటూ చెత్త‌నంతా ఊడ్చి ప‌డేశారు. ఇంకేముంది, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కేశారు. పీపీ సావని గ్రూప్ చైర్మన్ మహేశ్‌భాయ్ ఆధ్వ‌ర్యంలో సూర‌త్‌లో ఈ ఘ‌న‌త సాధించారు. 2013లో ఇదే సూర‌త్ వాసులు 2 లక్షల 75వేల మందితో రన్ ఫర్ యూనిటీ మారథాన్‌ను నిర్వహించి రికార్డు సృష్టించిన విష‌యం తెలిసిందే. మ‌ళ్లీ అక్క‌డి ప్ర‌జ‌లే స్వ‌చ్ఛ‌భార‌త్ కార్య‌క్ర‌మం కూడా ఇంత‌పెద్ద ఎత్తున చేప‌ట్టి రికార్డు సృష్టించ‌డం గ‌మ‌నార్హం.

  • Loading...

More Telugu News