: ఇది సినిమాలకు అమ్మకాదు.. అమ్మమ్మలాంటి ట్రైలర్!: రామ్ గోపాల్ వర్మ


సినీ అభిమానులను ఊరిస్తూ వచ్చిన 'బాహుబలి-2' ట్రైలర్ విడుదలైంది. విమర్శకుల నుంచి సైతం ఈ ట్రైలర్ కు అభినందనలు అందుతున్నాయి. ట్రైలరే ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఇంకెంత రేంజ్ లో ఉంటుందో అనే స్థాయిలో ఈ ట్రైలర్ ఉంది. ఈ ట్రైలర్ పై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఇది సినిమాలకు అమ్మలాంటి ట్రైలర్ కాదు... అమ్మమ్మలాంటి ట్రైలర్ అంటూ వర్మ పొగడ్తల వర్షం కురిపించాడు. ఇదే సమయంలో దర్శకుడు రాజమౌళిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. సినిమాను ఈ స్థాయిలో తీర్చిదిద్దిన దర్శక దిగ్గజం రాజమౌళికి 'మెగా బాహుబలి' శాల్యూట్ అంటూ ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News