: రోజా సస్పెన్షన్ పై 62 పేజీల నివేదికను సభలో ప్రవేశపెట్టిన కమిటీ.. మరో ఏడాది సస్పెండ్ చేయాలంటూ సిఫార్సు


వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సభా హక్కుల సంఘం నివేదికను ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం 62 పేజీలతో కూడిన నివేదికను ప్రివిలేజ్ కమిటీ సభకు సమర్పించింది. విచారణకు సంబంధించిన అన్ని విషయాలను ఈ నివేదికలో కమిటీ పొందుపరిచింది. రోజాపై ఇప్పటికే ఉన్న సస్పెన్షన్ ను మరో ఏడాది పాటు పొడిగించాలంటూ కమిటీ సిఫార్సు చేసింది. బేషరతుగా క్షమాపణ చెబుతానన్న రోజా... క్షమాపణ చెప్పలేదని నివేదికలో కమిటీ తెలిపింది. విచారణ సందర్భంగా వివిధ సందర్భాలలో భిన్నమైన వాదనలను రోజా వినిపించారని చెప్పింది. అయితే, రోజా సస్పెన్షన్ పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని సభకే వదిలేసింది కమిటీ.

  • Loading...

More Telugu News