: అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు..!: కాంగ్రెస్ తీరుపై కేసీఆర్ ఫైర్


తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డివి తొందరపాటు వ్యాఖ్యలని, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన తమకు లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు. ప్రజలు తమకు ఇచ్చిన గడువు వరకు ప్రభుత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ముందస్తుకు వెళ్లాలనే ఆలోచనతోనే పథకాలన్నీ అమలు చేస్తోందని ఉత్తమ్ అంటున్నారని, అయితే తాము ముందస్తుకు వెళ్లబోమని తెలిపారు.

‘‘మాకేం రందిలేదు. షెడ్యూల్ ప్రకారమే వెళ్తాం. మంచి పనులు చేస్తే ప్రజలే తిరిగి గెలిపించుకుంటారు’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సుదీర్ఘంగా మాట్లాడిన కేసీఆర్ తమ ప్రభుత్వానికి ఇంకా 27 నెలల సమయం ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులకు అంత తొందర ఎందుకో అర్థం కావట్లేదన్న కేసీఆర్.. ‘అమ్మ  పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’.. అన్నట్టు కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News