: ‘జనస్వరం’ ద్వారా అభిప్రాయాలు తెలియజేయండి: ప్రజలకు పవన్ కల్యాణ్ పిలుపు
జనసేన పార్టీ వెబ్ సైట్ లోని ‘జనస్వరం’ అనే పేజీ ద్వారా పలు అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చని ఆ పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. జనస్వరం అనేది ప్రజా వేదిక అని, విధానపరమైన అంశాల రూపకల్పనకు సంబంధించి ప్రజలు తమ అభిప్రాయాలను, సూచనలను, ఆలోచనా విధానాలను దీని ద్వారా తెలియజేయవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా, ఎన్ఆర్ఐ లను కూడా ఇందులో భాగస్వాములను చేసేందుకు ‘ఎన్ఆర్ఐ కనెక్ట్’ అనే లింక్ ను ఏర్పాటు చేసినట్టు పవన్ పేర్కొన్నారు.