: మానవతప్పిదాలు జరగకుండా ఉండేందుకు ఈవీఎంలే వాడాలి!: కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చిన అన్నా హజారే


ఈవీఎంలు వాడొద్దని పిలుపునిచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే షాకిచ్చారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఈవీఎంలే వాడాలని ఎన్నికల సంఘానికి సూచించారు. ఓట్ల లెక్కింపులో మానవతప్పిదాలు జరగకుండా ఉండేందుకు ఈవీఎంలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. కేజ్రీవాల్ వాదన పట్టించుకోనవసరం లేదని ఆయన ఈసీకి స్పష్టం చేశారు. ప్రపంచమంతా సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతున్న సమయంలో మళ్లీ తిరోగమనానికి పాల్పడేలా బ్యాలెట్ పేపర్లు వాడుదామని ప్రతిపాదించడం సరికాదని ఆయన హితవు పలికారు. 

  • Loading...

More Telugu News