: జయసుధ భర్త అంత్యక్రియలు పూర్తి... 11వ రోజున సంస్మరణ సభ
ప్రముఖ సినీ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ముంబైలోని అంధేరీలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు. 18 ఏళ్లుగా ఖాళీగా ఉన్న నితిన్ కపూర్ తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని సోదరి నివాసంలో ఉంటూ నెలన్నరగా సైకియాట్రిస్టు దగ్గర చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం తన చెల్లెలు నివాసం ఉంటున్న బిల్డింగ్ 6వ అంతస్తు పైనుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో హుటాహుటీన పిల్లలను తీసుకుని జయసుధ ముంబై వెళ్లారు. కాగా, 11వ రోజున హైదరాబాదులో నితిన్ కపూర్ సంస్మరణసభను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.