: పద్మావతి చిత్రం షూటింగ్ సెట్ ను ధ్వంసం చేయడంపై వర్మ ఆగ్రహం


బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పిరియడ్ డ్రామాగా తెరకెక్కిస్తోన్న 'పద్మావతి' చిత్రం షూటింగ్ సెట్లో పలువురు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరి సెట్‌ను పూర్తిగా ధ్వంసం చేసిన సంగ‌తి తెలిసిందే. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో జ‌రిగిన‌ ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ స్పందించాడు.  పద్మావతి సినిమా సెట్‌ పై మళ్లీ దాడి జరిగిందా? అని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నాడు. త‌న‌కు తెలిసి భారతీయులు ప్రాచీన కాలానికే వెళ్లిపోతున్నారని, ఇది సిగ్గుప‌డాల్సిన విష‌యం అని ఆయ‌న అన్నారు. త‌న‌కు తెలిసి సంజయ్‌ లీలా భన్సాలీకి పద్మావతి కథ గురించి ఎంత తెలుసో అందులో ఒక శాతం కూడా తెలియ‌ని వారే ఈ దాడులకు పాల్పడుతున్నారని వర్మ అన్నారు.

  • Loading...

More Telugu News