: ఎన్నికల్లో విజయం నేపథ్యంలో మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫోన్.. అభినందనలు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారత ప్రధానమంత్రి హవా కొనసాగి భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో, ఆయనకు ఊహించని వ్యక్తుల నుంచి అభినందనలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులే కాకుండా ప్రపంచ నేతల నుంచి కూడా ఆయన అభినందనలు అందుకుంటున్నారు. ఇటీవలే మోదీ.. అబుదాబి యువరాజు షేక్ మొహ్మద్ బిన్ జయీద్ అల్ నహ్యాన్, కెనడా మాజీ ప్రధానమంత్రి స్టీఫెన్ హార్పర్ల నుంచి అభినందనలు అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండే ఫోన్ చేసి మరీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ ప్రతినిధి గోపాల్ బగ్లే ఈ రోజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.
French President, HE Mr. @fhollande called PM @narendramodi today to convey his felicitations at the election results. @Elysee
— PMO India (@PMOIndia) March 15, 2017