: ముందస్తు ఎన్నికలకు సంబంధించి శాసనమండలిలో కేసీఆర్
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నారనే వార్త చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వార్తలకు శాసనమండలిలో కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన తమకు ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. తాము చేస్తున్న అభివృద్ధిని ప్రజలంతా అభినందిస్తున్నారని... ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని అన్నారు.
తెలంగాణకు అత్యంత ముఖ్యమైన ఇరిగేషన్ ప్రాజెక్టులను కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. సాంకేతిక అంశాలపై కేసులు వేస్తున్నారని విమర్శించారు. ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని చెప్పారు.