: కర్నూలులో అత్యాచార యత్నం.. ఆటోలోంచి దూకిన బాలిక!


కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒంటి పూట బడులను మధ్యాహ్నం 12 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తుండడంతో కర్నూలు జిల్లా మంత్రాలయం మాధవరంలో ఇంటి నుంచి స్కూలుకు వెళ్తున్న బాలికను ఆటోలో దింపుతానని మాయమాటలు చెప్పిన ఆటో డ్రైవర్ ఏడో తరగతి బాలికను ఆటో ఎక్కించుకున్నాడు. ఆ బాలిక ఆటో ఎక్కిన అనంతరం తన నిజస్వరూపం చూపించాడు. బాలికపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన బాలిక కదులుతున్న ఆటోలోంచి కిందికి దూకేసింది. దీంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News