: టీడీపీ నేతల ముందు కమల్, ప్రకాష్ రాజ్ లు కూడా పనికిరారు: చెవిరెడ్డి భాస్కరరెడ్డి
టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఏ పదవి కోరుకోలేదని పేర్కొంటూ, స్క్రిప్ట్ రాయించి కొందరితో చదివించారని ఆయన ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ నేతల యాక్టింగ్ ముందు ప్రముఖ నటులు కమలహాసన్, ప్రకాష్ రాజ్ కూడా పనికి రారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా తిరుపతిలో భూముల ఆక్రమణల అంశాన్ని ఆయన ప్రస్తావించారు. తిరుపతిలో భూముల ఆక్రమణల వివరాలపై కలెక్టర్, తహసీల్దార్ చెబుతున్న సమాధానాలకు ఎటువంటి పొంతన లేదన్నారు. తప్పుడు లెక్కలు చెబుతున్న కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని చెవిరెడ్డి డిమాండ్ చేశారు.