: యూపీ కాంగ్రెస్ చీఫ్ పదవికి సినీ నటుడు రాజ్ బబ్బర్ రాజీనామా
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందడంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం మొదలైంది. ఓటమికి గల కారణాలను అన్వేషించే పనిలో ఆ పార్టీ పెద్దలు పడ్డారు. అయితే, తమ నేత రాహుల్ గాంధీపై ఓటమి మచ్చ పడకుండా ఉండేందుకు గులాం నబీ అజాద్ లాంటి నేతలు ప్రయత్నిస్తున్నారు. సత్యవ్రత చతుర్వేది లాంటి సీనియర్ నేతలు మాత్రం రాహుల్ నాయకత్వ పటిమను ప్రశ్నించారు. అసలైన సమయంలో సరైన చర్యలు తీసుకోకుండా... ఇప్పుడు బాధపడితే ఏం ప్రయోజనమని ఆయన నిలదీశారు. మరోవైపు యూపీ కాంగ్రెస్ లో తొలి వికెట్ పడింది. ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్ చీఫ్ గా బాధ్యతలను నిర్వహించిన సినీ నటుడు రాజ్ బబ్బర్ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. అయితే, ఆయన రాజీనామాపై కాంగ్రెస్ అధిష్ఠానం ఇంకా స్పందించలేదు.