: ‘బిగ్’ కోరిక కోరిన బిగ్ బీ.. తీర్చ‌డం మాత్రం ఎవ్వ‌రికీ సాధ్యం కాదు!


బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ఏడాదికి 365 రోజులు కాకుండా 465 రోజులు ఉండేలా చూడాల‌ని దేవుడిని కోరారు. తాను ఇప్పుడు ఎంతో బిజీగా ఉన్నాన‌ని, టైమ్ స‌రిపోవ‌డం లేద‌ని ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలుపుతూ.. ఇప్పటివరకు 15కి పైగా స్క్రిప్టులు చదివాన‌ని అన్నారు. త‌న‌కు అవన్నీ నచ్చాయ‌ని, కానీ అన్ని సినిమాలు ఒప్పుకుని చేయడానికి 365 రోజులు సరిపోవని అందుకే అద‌నంగా మ‌రో 100 రోజులు ఉండేలా చేయమ‌ని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయ‌న సర్కార్‌-3, థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు.


  • Loading...

More Telugu News