: కేసీఆర్ మొక్కులపై హైకోర్టు నోటీసులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కులపై హైకోర్టులో పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. సాముదాయిక వినియోగ నిధి (సీజీఎఫ్) నుంచి కేసీఆర్ మొక్కులు చెల్లించుకోవడాన్ని ప్రశ్నిస్తూ ఈ పిల్ దాఖలైంది. ఈ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అఖ్తర్ ల ధర్మాసనం నిన్న విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, దేవాదాయ శాఖ కమిషనర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.