: అమ్మో! శశికళ ఫొటోనా?.. భయపడుతున్న ‘చిన్నమ్మ’ మద్దతుదారులు


చిన్నమ్మ శశికళ ఫొటో అంటేనే ఆమె మద్దతుదారులు భయపడిపోతున్నారు. ఎందుకొచ్చిన గొడవంటూ ఆమె ఫొటోకు దూరంగా ఉంటున్నారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా కోవిలంబాక్కంలో సంక్షేమ పథక సహాయాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇందుకోసం పల్లావరం-తురైపాక్కం రోడ్డులో శశికళ వర్గీయులు పెద్ద ఎత్తున భారీ బ్యానర్లను ఏర్పాటు చేశారు. అయితే వాటిలో ఎక్కడా శశికళ ఫొటో కానీ, పేరు కానీ లేకుండా జాగ్రత్త పడ్డారు. పొరపాటున కూడా ఆమె ఫొటో ప్రింట్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అక్రమార్జన కేసులో  ప్రస్తుతం జైలులో ఉన్న శశికళ ఫొటోను ముద్రిస్తే పార్టీ అభివృద్ధికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని భావించే ఆమె ఫొటో లేకుండానే బ్యానర్లను ముద్రించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫొటో లేకుండానే ప్రజల్లోకి వెళ్లడం మంచిదని ఆమె వీరాభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News