: రాజకీయాల్లోకి రాను కానీ.... మౌనంగా మాత్రం ఉండను: అమీర్ ఖాన్


భవిష్యత్ లో రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన తనకెప్పుడూ లేదని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ తెలిపాడు. పుట్టిన రోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ, తాను రాజకీయాల్లోకి రాకపోయినా ముఖ్యమైన సమస్యలపై తన వాణిని ఎల్లప్పుడూ వినిపిస్తానని అన్నాడు. దేశంలో చోటుచేసుకునే ఏదైనా అంశంపైనైనా తన అభిప్రాయాలు చెప్పేటప్పుడు నిర్లక్ష్యంగా మాత్రం ఉండనని అమీర్ ఖాన్ స్పష్టం చేశాడు. కళాకారుడిగా తాను దేశానికి చేయాల్సింది చాలా ఉందని అమీర్ ఖాన్ చెప్పాడు. తాను పోషించాల్సిన ఎన్నో పాత్రలు మిగిలి ఉన్నాయని చెప్పాడు. సినిమాలో నటించేటప్పుడు పాత్ర కోసం ఎంత కష్టమైనా అందుకే భరిస్తానని చెప్పాడు. 

  • Loading...

More Telugu News