: బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ...17 మందికి గాయాలు!


త్రిపురలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య  ఘర్షణ తలెత్తింది. ఈ రోజు తలెత్తిన ఈ ఘర్షణలో సుమారు 17 మంది గాయపడ్డారు. పదకొండు మంది పోలీసులు, ఇద్దరు ఫొటో జర్నలిస్టులు, బీజేపీ, తృణమూల్ పార్టీలకు చెందిన ఒక్కో కార్యకర్త గాయపడినట్టు పశ్చిమ త్రిపుర ఎస్పీ అభిజిత్ సప్తర్షి తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత సందీప్ రాయ్ బర్మన్ సోదరుడు సుదీప్ రాయ్ బర్మన్..బీజేపీ కార్యకర్తను కొట్టడంతో నిన్న రాత్రి ఈ వివాదం మొదలైంది. దీంతో, ఇరు పార్టీలకు చెందిన మద్దతుదారులు పెద్దఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ మరింత పెరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని, ముందస్తు జాగ్రత్తగా 144 సెక్షన్ విధించామని సప్తర్షి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News