: 25 కోట్లు లంచమే ఇచ్చి ఉంటే తిరిగొచ్చేవాడు: సరబ్ సోదరి


సరబ్ జిత్ సింగ్ సోదరి దల్బీర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. తన సోదరుడిని విడుదల చేయడానికి పాక్ ఉద్యమకారుడు అన్సార్ బర్నే 25కోట్లు డిమాండ్ చేశారని, అంత చెల్లించి ఉంటే తన సోదరుడు భారత్ కు తిరిగొచ్చి ఉండేవాడని బాధతో మీడియాకు తెలిపారు. ఈ మేరకు దల్బీర్ సింగ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. భారత ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే సరబ్ జిత్ మరణించి ఉండేవాడు కాదని దల్బీర్ వాపోయారు.

2005 నుంచి తాము చేస్తున్న అభ్యర్ధనలను పట్టించుకుని ఉంటే ఈరోజు సరబ్ హత్య జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేసింది. తన సోదరుడిని పాక్ ప్రభుత్వం హత్య చేసిందని ఆరోపించారు. సరబ్ మృతి తమ కుటుంబానికి తీరని లోటని కన్నీటి పర్యంతమైంది. సరబ్ ముందే చనిపోయినా వైద్యులు తమకు చెప్పకుండా ఉంచారని దల్బీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రజల పట్ల పాక్ వైఖరి తొలినుంచి వ్యతిరేకంగానే ఉందన్నారామె. సరబ్ హత్యకు నిరసనగా భారతదేశం ఒక్క తాటిపై నిలబడాలని, పాక్ అకృత్యాలపై కులమతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు స్పందించాలని ఆమె కోరారు.

  • Loading...

More Telugu News