: కరణ్ జొహార్ నాకు తండ్రికంటే ఎక్కువ: అలియా భట్
'బద్రీనాద్ కి దుల్హనియా' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ప్రముఖ యువనటి అలియా భట్ ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జొహార్ ను ఆకాశానికెత్తేసింది. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన కరణ్ తనకు తండ్రికంటే ఎక్కువ అని తెలిపింది. దర్శక, నిర్మాత మహేశ్ భట్ తనకు జన్మనిస్తే కరణ్ జీవితాన్నిచ్చాడని చెప్పింది. అందుకే కరణ్ తండ్రి కంటే ఎక్కువ అని పేర్కొంది. కాగా, బాలీవుడ్ కు 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమా ద్వారా అలియాను పరిచయం చేసింది కరణ్ జొహారే!