: గోవా సీఎంగా పారికర్ ప్రమాణ స్వీకారం


గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ మృదులా సిన్హా, పారికర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరయ్యారు. పారికర్ తోపాటు 8 మంది కేబినెట్ సహచరులు కూడా ప్రమాణాస్వీకారం చేశారు. గోవా అసెంబ్లీలో పారికర్ గురువారం బలపరీక్షను ఎదుర్కోనున్నారు. 

  • Loading...

More Telugu News