: ఇంత దారుణమైన మానసిక స్ధితి ఉన్న వ్యక్తులు కూడా ఉంటారా?: జగన్ పై కాల్వ శ్రీనివాసులు విమర్శలు


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ జగన్మోహ‌న్‌రెడ్డిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మండిప‌డ్డారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... వైసీపీకి, వైఎస్‌ కుటుంబానికి పెద్ద దిక్కుగా వ్యవహరించిన భూమా నాగిరెడ్డి మృతి చెందితే జ‌గ‌న్ కనీసం శ్రద్ధాంజలి కూడా ఘటించలేద‌ని అన్నారు. అంతేగాక‌, అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెడుతుంటే హాజ‌రుకాకుండా ఇంతవరకూ ఏ ప్రతిపక్షం చేయని తప్పు వైసీపీ చేసిందని ఆయ‌న చెప్పారు.

జగన్ ప్రవర్తన చూస్తుంటే సమాజంలో ఇంత దారుణమైన మానసిక స్ధితి ఉన్న వ్యక్తులు కూడా ఉంటారా? అని త‌న‌కు అనిపిస్తోందని కాల్వ శ్రీ‌నివాసులు అన్నారు. కాగా, భూమా నాగిరెడ్డి మృతి నేప‌థ్యంలో రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగలేదని, అందుకే సమావేశాలను రెండు రోజులు పొడిగిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

  • Loading...

More Telugu News