: ఆల్ టైం రికార్డును తాకిన నిఫ్టీ... దూసుకెళుతున్న రియల్టీ, ప్రైవేటు బ్యాంకులు


స్టాక్ మార్కెట్లకు నరేంద్ర మోదీ విజయం ఇచ్చిన ఉత్సాహం కొనసాగుతోంది. నేటి సెషన్లో నిఫ్టీ 50 సూచిక ఆల్ టైం రికార్డును తాకింది. ఓ దశలో 9,122.75 పాయింట్లను తాకిన నిఫ్టీ మధ్యాహ్నం 1:15 గంటల సమయంలో 9,078 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సూచికకు 52 వారాల గరిష్ఠస్థాయి 8,992 పాయింట్లు కాగా, కనిష్ఠస్థాయి 7,516 పాయింట్లు. కాగా, సమీప భవిష్యత్తులో ఈ ర్యాలీ కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ సెషన్ లో రియల్టీ సెక్టారు అత్యధికంగా 2.32 శాతం లాభాల్లో నడుస్తుండగా, ప్రైవేటు బ్యాంకులు సగటున 2.25 శాతం, ఫైనాన్షియల్ సేవల సంస్థలు 2.24 శాతం, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 2 శాతం లాభాల్లో సాగుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, లార్సెన్ అండ్ టూబ్రో, అల్ట్రా సిమెంట్స్, ఏషియన్ పెయింట్స్, యస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ, గ్రాసిమ్, బీహెచ్ఈఎల్, బీపీసీఎల్ తదితర కంపెనీలు 2.50 శాతం నుంచి 5.90 శాతం మేరకు లాభాలను సాధించాయి. భారతీ ఎయిర్ టెల్, గెయిల్, సన్ ఫార్మా, ఐడియా, కోల్ ఇండియా సంస్థలు ఒక శాతం వరకూ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News