: నంద్యాల నియోజక వర్గంలో వైసీపీ అభ్యర్థిని నిలబెడతాం: వైఎస్ జగన్


రెండు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందిన టీడీపీ నేత‌, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ఈ రోజు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో సంతాపం తెలిపిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్‌ జగన్‌మోహ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో ఖాళీ అయిన నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ అసెంబ్లీ సీటు తమ పార్టీదేనని అన్నారు. అక్కడ కచ్చితంగా త‌మ పార్టీ అభ్యర్థిని పోటీకి నిలబెడతామని తెలిపారు. భూమా నాగిరెడ్డి హుందాతనాన్ని కాపాడేందుకే తాము ఈ రోజు సభకు వెళ్లలేదని జ‌గ‌న్ అన్నారు.

  • Loading...

More Telugu News