: స.హ కమిషనర్ల నియామకంపై ప్రభుత్వానికి నోటీసులు


ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకంపై దాఖలైన పిటిషన్ పై విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించిన న్యాయస్థానం ప్రభుత్వానికి, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
దీనిపై తదుపరి ఉత్తర్వులకు లోబడే ప్రభత్వ చర్యలు ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. గతంలో గవర్నర్ తిరస్కరించిన వారినే ప్రభుత్వం మళ్ళీ నియమించిందంటూ,
కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News