: ‘సర్ప్రైజ్’ ఆఫర్‌తో కస్టమర్ల ముందుకు వచ్చిన ఎయిర్టెల్!
మార్కెట్లో రిలయన్స్ జియో ఇస్తోన్న పోటీని తట్టుకోవడానికి ఇప్పటికే ఎన్నో ఆఫర్లు గుప్పించిన ఎయిర్ టెల్ మరో ఆఫర్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది. తమ పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల ముందు ‘ఎయిర్టెల్ సర్ప్రైజ్’ ఆఫర్ కింద ఫ్రీగా 30జీబీ వరకు 4జీ డాటాను అందిస్తున్నట్లు ప్రకటించింది. అందుకోసం తమ వినియోగదారులు 'మై ఎయిర్టెల్ యాప్'లోకి వెళ్లి అందులో పోస్ట్‌పెయిడ్ ఆఫర్స్ యాక్టివేట్ చేసుకోవాలని సూచించింది.
యాప్‌లోని బానర్‌పై కనిపించే ‘క్లెయిమ్ ఫ్రీ డాటా’పై క్లిక్ చేస్తే ఈ ఆఫర్ యాక్టివేట్ అవుతుందని సూచించింది. ఆ సంస్థ సీఈవో గోపాల్ విఠల్ మాట్లాడుతూ... దేశంలో అత్యంత వేగవంతమైన మొబైల్ నెట్‌వర్క్‌ను అందిస్తున్నామని, ఈ సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్నామని అన్నారు. తమ ప్రయాణంలో భాగస్వాములైన కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు.