: అనుకోకుండా అలా జరిగిపోయింది...కనీసం స్నేహితులను కూడా పిలవలేకపోయా!: భావన


లైంగిక వేధింపుల ఘటన అనంతరం సినీ పరిశ్రమ, మీడియాకు అందుబాటులో లేని సినీ నటి భావన తాజాగా మీడియాతో మాట్లాడింది. రహస్యంగా నిశ్చితార్థం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నకు భావన సమాధానమిస్తూ, తన నిశ్చితార్థం విషయంలో రహస్యమేమీ లేదని చెప్పింది. సంప్రదాయం ప్రకారం తన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు నవీన్ కుటుంబ సభ్యులు వచ్చారని చెప్పింది.

ఈ సందర్భంగా మాటల మధ్యలో రెండు కుటుంబాలు అంగీకరించిన తరువాత ఆలస్యమెందుకు? అని చెబుతూ ఉంగరాలు మార్చుకోండని అన్నారని, దీంతో తన నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగిందని తెలిపింది. దీంతో తన నిశ్చితార్థానికి స్నేహితులను కూడా పిలవలేకపోయానని చెప్పింది. అసలు నిశ్చితార్థం విషయాన్ని కొన్నాళ్ల పాటు దాచివుంచాలనుకున్నామని, అయితే తన కుటుంబసభ్యులు తన ఎంగేజ్ మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం బయటకు తెలిసిపోయిందని భావన తెలిపింది. కాగా, ఆగస్టులో వీరి వివాహం జరగనుంది.

  • Loading...

More Telugu News