: శ్రీదేవి లాంటి లెజెండ్ తో మా పనిని పోల్చుకోలేము: సల్మాన్ ఖాన్
ప్రముఖ నటి శ్రీదేవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మా’ చిత్రాన్ని ఆమె భర్త బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ల విడుదల కార్యక్రమం ముంబయిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సల్మాన్ ఖాన్ హాజరయ్యాడు. సల్మాన్ ను వేదిక పైకి ఆహ్వానించే సమయంలో ‘స్టార్ ఆఫ్ ది మిలీనియమ్’ అంటూ వ్యాఖ్యాత మనీశ్ పాల్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సల్మాన్ స్పందిస్తూ, ‘అవీుర్, షారూక్, నేను, అక్షయ్ కుమార్ చాలా సినిమాలు చేశాం. అమీర్ మాత్రం తక్కువ చేస్తాడు. కొన్నాళ్ల నుంచి ఏడాదికి ఓ సినిమా చొప్పున చేస్తూ, మొత్తం 50 సినిమాల్లో నటించాడు. అదే షారూక్, నేను, అక్షయ్ ముగ్గురం కలిపి సుమారు 275 సినిమాల్లో నటించి ఉంటాము. శ్రీదేవి మాత్రం, బాలనటిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. మూడొందలకు పైగా చిత్రాల్లో నటించారు. ఆమె లాంటి లెజెండ్ తో మా పనిని పోల్చుకోలేము. తను ఒక లెజండ్’ అని సల్మాన్ అనడంతో చప్పట్లు మార్మోగిపోయాయి.