: తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కరిపై రూ. 40,149 రుణ భారం!


తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలపై తలసరి రుణ భారం రూ. 40,149గా బడ్జెట్ ప్రసంగంలో ఈటల రాజేందర్ తేల్చారు. మొత్తం రాష్ట్రం అప్పు రూ. 1,40,523 కోట్ల రూపాయలని చెప్పిన ఆయన, 2017-18లో రూ. 26,400 కోట్లను రుణంగా తీసుకోనున్నామని తెలిపారు. మొత్తం రాష్ట్ర జీడీపీలో 18.51 శాతానికి అప్పులు పెరిగాయని అన్నారు. గత సంవత్సరం సేల్స్ టాక్స్ రూ. 42,074 కోట్లు కాగా, ఈ సంవత్సరం రూ. 37,439 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. ఎక్సైజ్ ఆదాయం పెరిగిందని, 2015-16లో రూ. 5,083 కోట్ల ఆదాయం రాగా, ఈ సంవత్సరం రూ. 8,999 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్ల ఆదాయ లక్ష్యాన్ని తగ్గించుకున్నామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News