: మరోసారి అమెరికాకు చైనా వార్నింగ్
ఇప్పటికే పలుసార్లు అమెరికాకు వార్నింగ్ ఇస్తూ వ్యాఖ్యలు చేసిన చైనా తాజాగా మరోసారి అదేపని చేసింది. డబ్ల్యూటీవో నిబంధనలను పట్టించుకోకుండా తమ ఉత్పత్తులపై ట్యాక్స్‌లు విధిస్తే ఆ దేశంతో ట్రేడ్ వార్‌కు దిగుతామని పేర్కొంది. స్వంత ప్రయోజనాల కోసం నిబంధనలు పట్టించుకోకపోతే 1930 లో తలెత్తిన ట్రేడ్ వార్ మరోసారి కనపడుతుందని వ్యాఖ్యానించింది. అటువంటి విధానాలు అర్థవంతం కావని హితవు పలికింది. ఇటీవలే డబ్ల్యూటీవో నిర్ణయాలను పక్కనబెట్టి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తమ కొత్త వార్షిక ట్రేడ్ పాలసీ ఎజెండాలను కాంగ్రెస్ కు పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా ఈ వ్యాఖ్యలు చేసింది.
ఆమెరికా అటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తే తమ దేశీయ పరిశ్రమకు తీరని అన్యాయం జరుగుతుందని స్టేట్ రన్ గ్లోబల్ టైమ్స్ లో పేర్కొన్నారు. చైనా ఉత్పత్తులపై 45 శాతం ట్యాక్స్ విధించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ కారణంగా అమెరికా, చైనాల మధ్య సత్సంబంధాలు బలహీనపడడమే కాకుండా ప్రపంచమంతా ప్రభావం ఉంటుందని చైనా పేర్కొంది.