: కాషాయం రెపరెపలు.. యూపీలో దారుణంగా పడిపోయిన ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య!


భారత దేశంలో అత్యధిక ముస్లింల జనాభా ఉండే యూపీలో ఆ వర్గం ఎమ్మెల్యే అభ్యర్థులకు ఊహించని షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థులకు తీవ్ర పరాభవం ఎదురైంది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో 69 మంది ముస్లింలు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ, తాజా ఎన్నికల్లో మాత్రం కేవలం 24 మంది మాత్రమే గెలుపొందారు. 45 సిట్టింగ్ స్థానాల్లో ముస్లింలు ఓటమిపాలయ్యారు.

యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలుండగా... బీజేపీ ఒక్క స్థానంలో కూడా ముస్లింలకు టికెట్ ఇవ్వలేదు. తూర్పు యూపీ, తెరాయి, రోహిల్ ఖండ్ ప్రాంతాల్లో ముస్లింల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ... వారి ఓట్లు సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ ల కూటమి, బీఎస్పీల మధ్య చీలిపోయాయి. దీంతో, ఆ ప్రాంతాల్లో సైతం బీజేపీ విజయబావుటా ఎగురవేసింది. ఓట్ల చీలికతో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య దారుణంగా తగ్గిపోయింది. 

  • Loading...

More Telugu News