: భూమాను చివరిగా చూద్దామన్న పవన్ కల్యాణ్ కోరిక నెరవేరట్లేదు!
తెలుగుదేశం పార్టీ నేత భూమా నాగిరెడ్డి భౌతికకాయాన్ని కడసారిగా చూడాలన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరిక నెరవేరబోవడం లేదు. నేడు ఆళ్లగడ్డకు ఆయన వెళ్లాలని తొలుత భావించినప్పటికీ, ఆ ఆలోచనను మార్చుకున్నారు. తాను వెళితే, అభిమానులు పెద్ద సంఖ్యలో రావచ్చని, జనాలను కట్టడి చేయడం క్లిష్టతరమవుతుందని భావించిన ఆయన, తన ప్రయాణాన్ని విరమించుకున్నట్టు తెలుస్తోంది.
కాగా, భూమా అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు అధికారులు ఆళ్లగడ్డకు చేరుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. భూమా అంత్యక్రియలకు చంద్రబాబు సహా పలువురు మంత్రులు హాజరు కానున్నారు. తెలంగాణ నుంచి కూడా ఆయనతో అనుబంధమున్న పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు ఆళ్లగడ్డకు తరలి వెళ్తున్నారు.