: 16న పంజాబ్ సీఎంగా అమరీందర్ సింగ్ ప్రమాణ స్వీకారం


పంజాబ్  అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ కాంగ్రెస్ పార్టీ స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ కెప్టెన్ అమరీందర్ సింగ్ ఈ నెల 16న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా అమరీందర్ సింగ్ మాట్లాడుతూ, పంజాబ్ ఎన్నికల్లో విజయం సాధించిన తమను అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ఫోన్ చేశారని, తమ రాష్ట్రానికి ఏ సాయం కావాలన్నా చేస్తామని ఆయన హామీ ఇచ్చారని అన్నారు. ఇకపై రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలకు ఆస్కారం లేదని, ఆరోగ్యం, మాదక ద్రవ్యాల నిషేధంపై దృష్టి సారించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.   

  • Loading...

More Telugu News