: ‘భూమా’తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం కేసీఆర్


టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా భూమాతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో భూమా చురుగ్గా పాల్గొనేవారని అన్నారు. చిన్న వయసులోనే భూమా మృతి చెందడం తనను ఆవేదనకు గురి చేసిందన్నారు. భూమా పిల్లలు ఇంకా వృద్ధిలోకి రాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రస్తావించారు. భూమా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, భూమా మృతిపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి తదితరులు తమ సంతాపం వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News