: బ్రెజిల్ అధ్యక్షుడ్ని భయపెడుతున్న దెయ్యాలు!


బ్రెజిల్‌ అధ్యక్షుడు మైఖెల్‌ టెమర్‌ కు ఇప్పుడు దెయ్యాల భయం పట్టుకుంది. వినడానికి ఆశ్చర్యంగానే వున్న ఇది నిజం. బ్రెజిల్‌ రాజధాని బ్రసీలియాలోని తన అధికారిక నివాసమైన అల్వోరాడా ప్యాలెస్‌ లో దుష్టశక్తులు ఉన్నాయని అధ్యక్షుడు మైఖెల్ టెమర్ కి అనుమానం వచ్చింది. అతని అనుమానాన్ని భార్య మార్సెలా కూడా ధ్రువీకరించడంతో ఆయన ప్యాలెస్ మారాలని నిర్ణయించారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అనట్టు ఆయన ఇల్లు మారాలని అనుకోగానే అధికారులు 'జబురు' అనే మరో ప్యాలెస్ ను చూసి, అధ్యక్షుడికి చెప్పారు. దీంతో ఆయన నివాసం మార్చారు.

బ్రెజిల్‌ శిల్పి ఆస్కార్‌ నీమేయర్‌ డిజైన్‌ చేసిన అల్వరాడో ప్యాలెస్ లో పెద్ద ఈతకొలను, ఫుట్‌ బాల్‌ మైదానం, ఔషధ దుకాణం, చర్చి కూడా ఉండడం విశేషం. అయితే అధ్యక్షుడిగా భార్య మార్సెలా, కుమారుడు మైఖెల్‌ జిన్హోతో కలిసి అడుగుపెట్టిన టెమర్ అప్పటి నుంచి నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారట. దీంతో అనుమానం వచ్చిన ఆయన భార్యను అడగగా, ఆమె కూడా అలాంటి భయాన్నే వ్యక్తం చేయడంతో వాస్తు దోషముందేమోనని మరమ్మతులు చేయించడంతో పాటు, ప్రత్యేక ప్రార్ధనలు కూడా చేయించారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆయన జబురు ప్యాలెస్ కి మారిపోయినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News