: నాగర్ సోల్-తిరుపతి రైలులో దోపిడీ దొంగల బీభత్సం
నాగర్ సోల్-తిరుపతి ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు. వర్లి రైల్వే స్టేషన్ లో ట్రైన్ లోనికి ఎక్కిన దొంగలు...మూడు బోగీలపై విరుచుకుపడ్డారు. సుమారు 15 మంది దోపిడీ దొంగలు ట్రైన్ చైన్ లాగి ఆపి, రైలులోని ఎస్ 1, ఎస్ 3, ఎస్ ఈ బోగీల్లోని ప్రయాణికులను నిలువునా దోచుకున్నారు. దోపిడీ దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పలువురు ప్రయాణికులను గాయపరిచినట్టు తెలుస్తోంది. దీనిపై ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రయాణికుల జేబులు కూడా కత్తిరించి దోపిడీ దొంగలు దోచుకెళ్లినట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.