: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌కి ప్రధాని ఫోన్.. డబుల్ గ్రీటింగ్స్ చెప్పిన మోదీ!
పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించిన విషయం తెలిసిందే. ఈ విజయం ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కెప్టెన్ అమరేందర్‌సింగ్‌కి పుట్టిన రోజు గిఫ్ట్‌లా అందింది. అవును.. ఈ రోజు ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ విషయాలపై స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు ఆయన పుట్టిన రోజు సందర్భంగా తాను శుభాకాంక్షలు తెలిపానని మోదీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి కెప్టెన్ అమరేందర్‌సింగ్ లంబి నియోజకవర్గంలో ఓడిపోగా, పాటియాలా అర్బన్ నుంచి 52,375 ఓట్లతో విజయం సాధించిన విషయం తెలిసిందే. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 75 స్థానాల్లో విజయం లభించింది. మరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Spoke to @capt_amarinder & congratulated him on the win in Punjab. Also wished him a happy birthday & prayed for his long & healthy life.
— Narendra Modi (@narendramodi) March 11, 2017